MAD Square | ‘మ్యాడ్’ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వ్యేర్’ రానుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు నటించిన ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకుడు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.
మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. నలుగురు మిత్రబృందం చేసే అల్లరి, హంగామాతో టీజర్ ఆసాంతం వినోదభరితంగా సాగింది. పంచ్‌డైలాగ్‌లు కడుపుబ్బా నవ్వించాయి. తొలిభాగంతో పోల్చితే సీక్వెల్ రెట్టింపు వినోదంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని, ఇప్పటికే విడుదలైన ‘లడ్డుగానీ పెళ్లి’ ‘స్వాతి రెడ్డి..’ అనే పాటలు బాగా పాపులర్ అయ్యాయని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయిసౌజన్య, సమర్పణ: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: కల్యాణ్‌శంకర్.