HomeDevotionalFasting And Jagaram Are Two Aspects That Are Special About The Festival Of Shivaratri
Maha Shivaratri | ఉపవాసం అంటే పుణ్యం కోసం చేసేదే కాదు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసా!
Maha Shivaratri | ఉపవాసం, జాగరణ రెండు అంశాలు శివరాత్రి పర్వదిన ప్రత్యేకతలు. ఉపవాసం అంటే ‘భగవంతుడికి దగ్గరగా’ గడపడం అని అర్థం. దీంతో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు చాటుతున్నాయి.
Shivaratri | ఉపవాసం, జాగరణ రెండు అంశాలు శివరాత్రి పర్వదిన ప్రత్యేకతలు. ఉపవాసం అంటే ‘భగవంతుడికి దగ్గరగా’ గడపడం అని అర్థం. దీంతో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు చాటుతున్నాయి.
కొన్ని అధ్యయనాల ప్రకారం ఉపవాసం రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండే క్రమాన్ని మెరుగుపరుస్తుంది.
రక్తపోటు (బీపీ), ట్రైగ్లజరైడ్లు, కొలెస్ట్రాల్ స్థాయులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అలా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థకు సంబంధించిన న్యూరో డిజనరేటివ్ రుగ్మతలను నివారిస్తుంది.
ఆహారం తీసుకోం కాబట్టి, శరీరానికి క్యాలరీలు అందవు. దీంతో బరువు తగ్గడానికీ అవకాశం ఉంటుంది. జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం ఉపవాసం ఆయుర్దాయాన్ని పెంచుతుంది. క్యాన్సర్ నివారణలో కూడా సహాయకారిగా ఉంటుంది.
పక్షం రోజులకోసారి ఉపవాసం ఆచరిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దలు ఏకాదశి తిథి నాడు ఉపవాసం పాటించాలని సూచించడం వెనుక ఆంతర్యం ఇదే!