Occult Worship | చండ్రుగొండ, ఫిబ్రవరి 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం, బాలికుంట గిరిజన ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం రోజు లాగానే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసిన దృశ్యాన్ని గమనించి తల్లిదండ్రులకు తెలియజేశారు.
వెంటనే అక్కడికి గ్రామస్తులు, ఉపాధ్యాయుడు ధరావత్ రవి వచ్చి క్షుద్ర పూజలు చేసిన దృశ్యాలు పరిశీలించి వెంటనే ఆ ప్రదేశాన్ని నీటితో కడిగించారు. అనంతరం విద్యార్థులకు భయపడకుండా ధైర్యం చెప్పారు. విషయం దావానంగా వ్యాపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళలో పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
KCR Birthday | ‘ప్రజల హృదయాల్లో నిలిచి.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్’
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్