KCR Birthday | మధిర, ఫిబ్రవరి 17: తెలంగాణ జాతిపిత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల రాజు అన్నారు. ఇవాళ మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకల (KCR Birthday)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. స్థానిక సేవా సంస్థల్లో వృద్ధులకు, దివ్యాంగులకు, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యాలయంలో డ్యాన్స్ చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణ త్యాగానికి వెనకాడకుండా ఉద్యమించిన నేత కేసీఆర్ అన్నారు.
మళ్లీ ప్రజాక్షేత్రంలోకి..
రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్లపాటు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పాటు పడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సాధించి పెట్టిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్న విషయాన్ని గుర్తించిన మాజీ సీఎం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసి కాంగ్రెస్ పాలన ఎండగట్టే విధంగా కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమించాలని సూచించారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రజల దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, అరిగ శ్రీనివాసరావు, బిక్కీ కృష్ణ ప్రసాద్, ఎన్నంశెట్టి అప్పారావు, కటికల సత్యనారాయణ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ఆళ్ల నాగబాబు, వంకాయలపాటి నాగేశ్వరరావు, జగన్మోహన్రావు, తొగరి ఓంకార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్