jitesh V Patil | భద్రాద్రి కొత్తగూడెం : ఎన్నికల నియమాలు తప్పక పాటించాలని ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆర్ఓ, ఏఆర్ఓల కు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ఇవాళ జిల్లా కేంద్రం పాత కొత్తగూడెం ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ.. ముఖ్యంగా నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల వద్ద ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ఆర్ఓ, ఏఆర్ఓలకు విధుల గురించి ఎన్నికల శిక్షకులు చంద్రశేఖర్ రావు, శ్రీనివాస్ చలపతి రాజు స్వామి, సతీశ్ కొన్ని ముఖ్య నియమాలు తెలియజేశారు. విధుల్లో ఉన్నపుడు ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు అని సపరేట్ గా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ శిక్షణలో జిల్లా పంచాయతీ అధికారి చంద్ర మౌళి, రమణ, పుల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం