చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే..చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన గెడెం కమలహాసన్(44) గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తాపీ పనిచేసుకునే కమలహాసన్ వరంగల్ ప్రాంతం నుండి వఛ్చి కలివేరులో వుంటున్నాడని తెలిసింది. చర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కమలహాసన్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..
US Attacks | యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు.. 38 మంది మృతి
Karthi at Sabarimala | శబరిమల అయ్యప్పను దర్శించుకున్న నటులు కార్తి, జయం రవి
Chai Reel | రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని చాయ్ తాగుతూ రీల్.. ఆ తర్వాత ఏమైందంటే?