US Attacks | యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు.. 38 మంది మృతి
యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
సనా: యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ దాడులను అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్‌తో పాటు హౌతీ ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది. రాస్ ఇసా చమురు పోర్టు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. హౌతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాన్ని ధ్వంసం చేయడానికి, వారి ఆదాయ వనరులను దెబ్బతీయడానికే ఈ దాడులు నిర్వహించామని అమెరికా ప్రకటించింది. కానీ యెమెన్‌లోని ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టలేదని వివరించారు. మార్చి 15న హౌతీలపై యుద్ధం ప్రకటించిన తర్వాత ఇదే అతిపెద్ద దాడని తెలిపారు.
గత నెల 17న కూడా హౌతీలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యెమెన్ రాజధాని సనా, సదా, హౌతీల బలమైన ప్రాంతం అల్బేద్, రాడాలపై అమెరికా సేనలు శనివారం బాంబుల వర్షం కురిపించాయి. ఎర్రసముద్రంలో అగ్రరాజ్య నౌకపైకి హౌతీలు దాడికి సమాధానంగా అమెరికా పెద్దయెత్తున జరిపిన బాంబు దాడుల్లో 31 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. బాంబు దాడులతో ఆయా ప్రాంతాలు భూకంపం వచ్చినట్టు కంపించిపోయాయని స్థానికులు తెలిపారు. కాగా, ‘మీ టైం అయిపోయింది. ఈ రోజు నుంచే మీ దాడులను నిలిపివేయండి. అలా చేయకపోతే ఇంతకుముందెన్నడూ చూడని విధంగా నరకాన్ని చవిచూస్తారు. తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే ఎప్పుడు చూడని రీతిలో బాంబుల వర్షం కురిపిస్తాం. ప్రపంచంలోని జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపలేదు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హౌతీలను హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

