బెంగళూరు: ఆకతాయిల ఆగడాలకు అంతేలేకుండా పోతున్నది. రీల్స్ పిచ్చిలో (Chai Reel) తోచింది చేసి అదే తమ సృజనాత్మకగా ఊహల్లో తేలిపోతున్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ఓ రోడ్డు మధ్యలో ఓ ఆకతాయి కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని చాయ్ తాగుతూ రీల్ చేశాడు. అదికాస్తా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కట్‌చేస్తే సోషల్ మీడియాలో ఆ రీల్ ఎంత వేగంగా షేర్ అయిందో.. అంతే వేగంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల్లో పెట్టారు.
బెంగళూరులోని మాగడి రోడ్ మధ్యలో ఓ వ్యక్తి కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. దర్జాగా చాయ్ తాగుతూ రీల్ చేశాడు. అనంతరం దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అది ప్రజల దృష్టిని ఆకర్షించడంతో వైరల్ అయింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అంతే వేగంగా స్పందించారు. వీడియో ఆధారంగా అతడిని గుర్తించి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆ రీల్‌ను మాగడి రోడ్లో ఏప్రిల్ 12న తీశారని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ట్రాఫిక్ లైన్ దగ్గర కూర్చుని చాయ్ తాగితే మీకు ఫైన్ పడుతుందే తప్ప.. ఫేమస్ కాలేరు. పోలీసులు మీమ్మల్ని గమనిస్తున్నారు అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇలాంటి విపరీత ధోరణులు శిక్షార్హం అని హెచ్చరించారు.
Taking tea time to the traffic line will brew you a hefty fine, not fame !!! BEWARE BCP is watching you#police #awareness #weserveandprotect #stayvigilant pic.twitter.com/5A8aCJuuNc
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) April 17, 2025