Sabarimala Ayyappa | తమిళ నటులు కార్తి (Karthi), జయం రవి(Ravi Mohan) శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న కార్తి, జయం రవిలు గురువారం రాత్రి ఇరుముడితో శబరిమలకి వెళ్లి మణికంఠుడిని దర్శించుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. దర్శననంతరం కార్తి మాట్లాడుతూ.. తాను తొలిసారి స్వామి మాల వేసుకుని శబరిమలకి వచ్చానని.. ఈ అనుభవం తనకు మానసిక శాంతిని, బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
కన్నె స్వామి(అయ్యప్ప మాల మొదటిసారి వేసుకున్నవారు)గా ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పవళింపు సేవలో స్వామి వారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. భవిష్యత్తులో కూడా స్వామి వారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను అని కార్తి మీడియాతో అన్నారు.
జయం రవి మాట్లాడుతూ.. తాను ఇదివరకే చాలాసార్లు శబరిమల ఆలయాన్ని సందర్శించానని తెలిపారు. “నేను 2015 నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు తొమ్మిదిసార్లు శబరిమలను దర్శించుకున్నాను. స్వామిపై నాకు ఎంతో నమ్మకం ఉంది. నా జీవితంలో చాలా మంచి జరిగిందని తెలిపారు.
நடிகர் ரவிமோகனுக்கு சபரி மலை ஐயப்பனை தரிசனம் செய்ய உதவி புரிந்த கேரளா போலீஸ்.!
Tamil film stars Karthi and Ravi Mohan visit Sabarimala#Sabarimala #Karthi #RaviMohan pic.twitter.com/iBtyWNddS5
— FridayCinema (@FridayCinemaOrg) April 18, 2025