Kunamneni Sambasiva Rao | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 : రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ పాల్వంచ పట్టణ పరిధిలోని వాసవి బాంకెట్ హాల్లో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యులు సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చేసే పనిలో కేంద్ర బీజేపి ప్రభుత్వం ఉందని, అధికారం కోసం బిజెపి ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టీ సీబీఐ, ఈడీ ద్వారా దాడులు జరుపుతూ ప్రతి పక్షాలను భయపెడుతున్నారని విమర్శించారు. మావోయిస్టులను మార్చి వరకు లేకుండా చేస్తాం అని అమిత్ షా ప్రకటన వెనక ఆంతర్యం ఏంటి అని, ప్రశ్నించే గొంతుకులను నలిపివేయటమే బిజెపి ఎజెండాగా పెట్టుకుందని విమర్శించారు.
పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది ఎర్ర జెండానేని అన్నారు. సమ సమాజ స్థాపన-సోసలిస్టు రాజ్య సాధనే కమ్యూనిస్టుల లక్ష్యం అని, అందుకోసం ఎటువంటి త్యాగాలకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని, పొత్తులు సర్దుబాట్లపై ఎన్నికల వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో ప్రతీ పంచాయతీలో సీపీఐకి ప్రాతినిధ్యం వచ్చే విధంగా కార్యకర్తలు, నాయకులు కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లావ్యాప్తంగా సీపీఐ శత వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. శత వసంతాల వేడుకలతో పార్టీ ప్రజా సంఘాలను మరింత బలోపితం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, సర్ రెడ్డి పుల్లారెడ్డి, సలీం, కే సారయ్య, కల్లూరి వెంకటేశ్వరరావు, కమటం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మి కుమారి, నారాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, దేవరకొండ శంకర్, పట్టణ మండల కార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, బంధం నాగయ్య, గుగులోత్ రామ్ చందర్, డి సుధాకర్, జి రామకృష్ణ, సతీష్, బుర్ర కేశవరావు, నారాయణ, ఎండి యూసుఫ్, ధర్మ, గోగ్గిల కృష్ణ, జిల్లా సమితి సభ్యులు, ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం