Macha Nageswara Rao | చండ్రుగొండ, ఫిబ్రవరి 13 : అశ్వారావుపేట(నియోజకవర్గం),చండ్రుగొండ(మండలం), బెండలపాడు గ్రామ శివారులో జరుగుతున్న సమ్మక్క సారలమ్మల జాతర మహోత్సవంలో అశ్వారావుపేట మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు (Macha Nageswara Rao) పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మెచ్చా నాగేశ్వరరావును శాలువాతో సత్కరించారు.
అనంతరం అక్కడికి వచ్చిన భక్తులు మెచ్చా నాగేశ్వరరావుతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపడంతో ఆయన అందరితో ఆత్మీయంగా మాట్లాడారు. ఫొటోలు దిగుతూ సరదా సమయం గడిపారు. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ అధ్యక్షులు దారా బాబు, ప్రధాన కార్యదర్శి సంగోండి రాఘవులు, మాజీ వైస్ MPP నరకుల్ల సత్యనారాయణ, నల్లమోతు వెంకట నారాయణ, మేడా మోహన్ రావు, సురా వెంకటేశ్వర్లు, భూపతి రమేష్, రామరాజు, పండ్ల అంజన్ రావు, పుసం వెంకటేశ్వర్లు, గూగులోతు రమేష్, నరకుల్ల వాసు, కేలోతు శ్రీనివాస్ నాయక్, కెల్లం వెంకటేశ్వర్లు, వంకాయల పాటి బాబురావు, యువ నాయకులు శ్రవణ్, బాదుషా, యాకుబ్ పాషా, బుల్లియ్య, కృష్ణ, శ్రీను, తేజావత్ వెంకన్న, కెక్కర్ల వెంకన్న,రాజ్ కుమార్ తదితరులున్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం