Ganja | తిమ్మాపూర్, జూన్ 18 : గంజాయి మత్తుకు అలవాటు పడితే ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందని ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు.
యువత, కొంతమంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు. గంజాయి వాడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. గంజాయి వాసన కూడా చూడవద్దని యువతీ యువకులను హెచ్చరించారు. గంజాయి అమ్మినా, వాడినా కూడా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటరమణ, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్