Women Police | తిమ్మాపూర్, మార్చి 8 : పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని తిమ్మాపూర్ సీఐ స్వామి అన్నారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఎస్సై వివేక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీఐ స్వామి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అన్ని కేసుల్లో ధైర్యంగా డీల్ చేస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేసి భార్యాభర్తలను ఒక్కటి చేస్తున్నారన్నారు. అనంతరం మహిళ సిబ్బంది కేకు కోసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్