Congress Leaders | చిగురుమామిడి, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆరోపించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి, దిగుమతులు లేకపోవడంతోనే యూరియా కొరత నెలకొందని, కేంద్ర ప్రభుత్వం తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేలా మాట్లాడటం సరికాదన్నారు. రైతుల యూరియా కష్టాలు తీర్చాల్సిన బాధ్యతను మరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.
యూరియా కొరతలపై తెలంగాణ రైతాంగం నిజానిజాలను, వాస్తవాలను గమనిస్తోందని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్ కు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన యూరియా 9.8 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ఈ ఆగస్టు నెలాకరుకు 8.3 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి వుంది. కానీ ఇప్పటివరకు కేవలం 5.72 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారన్నారు. రాష్ట్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయలేని కేంద్ర ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తుందన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల స్టీరింగ్ కమిటీ సభ్యుడు గీకురు రవీందర్, చిట్టుమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కూతురు రవీందర్ రెడ్డి పూదరి వేణు గోపాల్, బోయిని వంశీకృష్ణ నాయకులు పోలు శ్రీనివాస్ , సోషల్ మీడియా కో- కన్వీనర్లు బుర్ర శ్రీనివాస్, జిల్లేల రమేష్ లు పార్టీ నాయకులు కవ్వంపెల్లి సంజీవ్, సిరవేణి సంపత్, పెసరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం