Teacher Transfer | ఎల్లారెడ్డిపేట, జూలై 15: గత కొన్నేండ్లుగా ఇద్దరు ఉపాధ్యాయులతో కొనసాగుతున్న కిష్టూనాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండగా గత రాత్రి అందులోంచి ఓ ఉపాధ్యాయురాలి బదిలీతో తండా వాసులు ఆవేదన చెందుతున్నారు.
తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలో 16 మంది, అంగన్వాడీలో 10 మంది (పూర్వ ప్రాథమిక పాఠశాల) విద్యార్థులు ఉండగా రెండు గదుల్లో ఒక్కొక్కరు పాఠాలు చెప్పేది. 2017లో తండాలోని అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహించిన టీచర్ బదిలీపై రాజన్నపేటకు వెళ్లింది. దీంతో అంగన్వాడీ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు చదువు చెప్పేవారు లేక ఇద్దరు ఉపాధ్యాయులు పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాల గదుల్లో విద్యాబోధన చేస్తున్నారు.
ఇద్దరి లోనుంచి ఒకరిని బదిలీ చేయడంతో తండా వాసులు అసహనం వ్యక్తం చేశారు. తమ ఉపాధ్యాయురాలిని తమకే కేటాయించాలని ఎంఈవో కృష్ణహరికి విన్నవించుకున్నారు. దీని కోసం కలెక్టర్ సందీప్కుమార్ను కలుస్తామని గ్రామస్తులు తెలిపారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి