వేములవాడ రూరల్ ఫిబ్రవరి 20 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత సంచరిస్తోంది. వేములవాడ అర్బన్ మండల పరిధిలో గల హన్మక్కపల్లి గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకి చెందిన పొలం దగ్గర కట్టేసిన ఆవు దూడ పై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చిరుత సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వెంకట్రాజం సూచించారు. ప్రజలు పొలం వద్దకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకూడదని, పశువులను ఇంటి వద్ద కట్టేసుకోవాలన్నారు. చిరుత సంచారం గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే చిరుత దాడిలో మృతి చెందిన అవును ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
Hey Balwant Review | హే బల్వంత్… బిజినెస్ హిట్ అయ్యిందా?
Yadagirigutta | గుట్టలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. మత్స్యావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు
Ambati Rambabu | వైస్ఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు.. ప్రజాపోరాటాన్ని కొనసాగించాలని సూచన