అమరావతి : ఇటీవలే జైలు నుంచి బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో కలుసుకొని పలు విషయాలు చర్చించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు ఆందోళన చెందొద్దు అని ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా ఎదుర్కొందామని భరోసానిచ్చారు. ప్రజా పోరాటం కొనసాగించాలని సూచించారు.
కొంతమంది పోలీస అధికారుల తీరును జగన్ తప్పు పట్టారు. టీడీపీ రౌడీయిజానికి బెదరకుండా ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, తదితరులు ఉన్నారు.