Land Issues | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 15 : భూభారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీసీఎల్ఏ లోకేష్ కుమార్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. భూభారతి చట్టం నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఫైల్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ విధానంలో ప్రొసీజర్ ప్రకారం మాత్రమే నిర్వహించాలని, త్వరలో దరఖాస్తు పెండింగ్ ఎక్కడ ఉన్నది చెక్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు నుంచి వచ్చే తీర్పు మేరకు సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం వాటిని మినహాయించి మిగిలిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ డీ సెక్షన్ సూపరింటెండెంట్ రామచంద్రం, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి