Maneru Flood | గంభీరావుపేట, ఆగస్టు 27 : భారీ వర్షాలకు ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గంభీరావు పేట శివారులో గేదెలను మేపేందుకు రైతులు మార్గమధ్యలో ఉన్న వాగు అవతలి వైపు వెళ్లారు. అయితే మానేరు ఉప్పొంగి వరద ప్రవాహం పెరుగడంతో రైతులు అక్కడే చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తుండటంతో సమాచారమందుకున్న రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది.
వాగు అవతలి వైపు చిక్కుకున్న రైతులకు రెస్య్కూ టీం డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను పంపించింది. ఏగువ మానేరు ప్రాజెక్టు దగ్గర వ్యక్తి గల్లంతయ్యాడు. మానేరు క్యాంపునకు చెందిన రైతు పంపు కాడి నాగం గల్లంతయినట్లు సమాచారం. ఇంకా ఐదుగురు రైతులు వాగు అవతలి గడ్డకు చిక్కుకున్నారు. చిక్కుకున్న వారిలో జంగం స్వామి, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామి ఉన్నారు.
Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు
Zaheerabad Rains | నిండుకుండలా మంజీరా.. పొంగిపొర్లుతున్న వాగులతో స్తంభించిన జనజీవనం
Zaheerabad Floods | వరద ముంపులో జహీరాబాద్ కాలనీలు.. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే మాణిక్ రావు