పెద్దపల్లి: గోదావరిఖని 11 ఇంక్లైన్ బొగ్గుగని(Coal Mine)లో ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన కార్మికుడు ఐలయ్య గాయపడ్డాడు. కోల్ కట్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఐలయ్య చేతి మడిమ, కుడి కాలుకు గాయాలయ్యాయి. బ్లాస్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలింది. సమీపంలో ఉన్న ఇతర కార్మికులు తక్షణమే ఐలయ్యను ఆస్పత్రికి తరలించారు. తొలుత గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి గాయపడ్డ కార్మికుడిని తీసుకెళ్లారు. అయితే మెరుగైన వైద్యం కోసం అతన్ని మళ్లీ హైదరాబాద్ తరలించారు.