Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్‌పై వరంగల్‌కు చెందిన భక్తుడు చేయి చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జాతర గ్రౌండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానం వచ్చి ఓ భక్తుడిని విచారించారు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించిన ఉన్న సదరు భక్తుడు బ్లూకోట్ పోలీస్‌పై దాడి చేశాడు. కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడమే కాకుండా అతన్ని బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది.
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న భక్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు భక్తుడితో పాటు అతనితో ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.