Bus Tyre fire | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 28 : సింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం ఎల్కతుర్తిలో జరిగిన సభకు వెళుతున్న క్రమంలో పెద్ద ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగాబస్సు టైర్ల నుంచి మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సింగారం నుంచి బస్సులో 42 మందితో రజతోత్సవ సభకు బయలు దేరారు. బస్సు ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకోగానే వెనక టైర్ల నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన వాహన దారులు బస్సులో ఉన్న వారికి ఈ విషయం తెలిపే ప్రయత్నం చేశారు.
అయితే ఓ వైపు బస్సు శబ్ధం, మరోవైపు బస్సులో ఉన్నవాళ్లు మాట్లాడుకుంటూ.. పాటలు పాడుతూ వెళుతుండటంతో వాహనదారులు చెప్తున్న మాటలు వారికి వినపడలేదు. ఈ క్రమంలో బస్సు వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ మంటలు వస్తున్న విషయాన్ని బస్సులో ఉన్నవారికి చెప్పేందుకు వేగంగా తన కారును బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపాడు.
ఆ వెంటనే బస్సు డ్రైవర్‌కు ప్రమాదం విషయం తెలియజేశాడు కారు డ్రైవర్. దీంతో బస్సు డ్రైవర్ వెంటనే బస్సులోని గ్రామస్తులను కిందకు దింపి మంటలార్పారు. కారు డ్రైవర్ అందరినీ అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత గ్రామస్తులంతా మరో బస్సులో సభకు తరలి వెళ్లారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్