EX MLA Rameshbabu | కోనరావుపేట: మండలంలోని నాగారం గ్రామంలో కోదండ రామస్వామి ఆలయంలో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు.
అనంతరం చెన్నమనేని ఆలయ ఆవరణలో కూర్చుని గ్రామస్థులతో ముచ్చటించారు. గ్రామంలోని మేకల భూమయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా.. పరామర్శించి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఆయన వెంట సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మాజీ వైస్ ఎంపీపీ తీగల రవీందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్