honor | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 18 : రక్త దాతలను ప్రోత్సహించి, రక్తాన్ని సేకరించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విశ్రాంత తహసిల్దార్ పెండ్యాల కేశవరెడ్డిని విశ్రాంత ఉద్యోగుల సంఘం, వయోవృద్ధుల సంక్షేమ సంఘం, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.
నగరంలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదవీ విరమణ అనంతరం నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా కేశవరెడ్డి ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు.
అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా రక్తదాతల ఉత్తమ ప్రోత్సాహకునిగా ప్రశంసా పత్రం అందుకోవటం అభినందనీయమని అన్నారు. అనంతరం కేశవరెడ్డిపి శాలువాలు కప్పి, పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్