పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 4: పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులోని గుండారం రిజర్వాయర్‌కు వెళ్లే ఎస్ఆర్ఎస్పీ కాలువలో గుర్తుతెలియని పురుషుడి మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం చేరవేశారు. విషయం తెలుసుకున్న బసంత్ నగర్ ఎస్ఐ స్వామి గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకీ తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆచూకీ తెలిసినవారు వివరాల కోసం బసంత్ నగర్ ఎస్ఐ సెల్ నంబర్ 8712656509 లో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Dhoni: గైక్వాడ్‌కు గాయం.. చెన్నై జట్టు కెప్టెన్‌గా మళ్లీ ధోనీ !
HCU Issue | సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు.. ఓ ప్రొడ్యూసర్‌కు ముఖ్యనేత ఫోన్.. ఎడాపెడా వాయింపు