Dhoni: గైక్వాడ్‌కు గాయం.. చెన్నై జట్టు కెప్టెన్‌గా మళ్లీ ధోనీ !
Dhoni : ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. హోంగ్రౌండ్లో జరిగే మ్యాచ్‌లో మళ్లీ ధోనీ కెప్టెన్సీ చేపడుతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
చెన్నై : ఐపీఎల్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నది. అయితే ఈ మ్యాచ్ కోసం.. చెన్నై జట్టుకు ధోనీ(Dhoni) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్‌కు గాయం కావడంతో.. కెప్టెన్సీ పాత్రను ధోనీ పోషిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గాయపడ్డాడు. తుషార్ పాండే బౌలింగ్‌లో అతని మోచేతికి బలంగా బంతి తగిలింది. దీంతో రుతురాజ్ తీవ్ర ఇబ్బందిపడ్డాడు.
అయితే ఇవాళ్టి మ్యాచ్ కోసం గైక్వాడ్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను గైర్హాజరు అయితే, అతని స్థానంలో ధోనీ సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గైక్వాడ్ స్థానంలో బ్యాటర్‌గా డేవాన్ కాన్వే బరిలోకి దిగే ఛాన్సు ఉన్నది. శుక్రవారం నెట్స్‌లో అతను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఓపెనర్‌గా కాన్వే ఆడే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ త్రిపాఠీతో అతను ఓపెనింగ్ వచ్చే ఛాన్సు ఉన్నది. రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో ఆడించనున్నారు. జేమీ ఓవర్టన్ను పక్కన పెట్టి ఈ మ్యాచ్‌కు ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను ఆడించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK
- DC
- Dhoni
- elbow injury
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

