పెద్దపల్లి రూరల్ : తాటి చెట్టు పై నుండి పడి ఓ గీత కార్మికుడికి(Toddy worker injured )గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని పెద్దపల్లి మండలం హనుమంతునిపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్లకొండ లక్ష్మయ్య అనే గీత కార్మికుడు వృత్తినిర్వహణలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతనిని పెద్దపల్లి ప్రభుత్వ దవఖానకు తరలించారు. కాగా, నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, గౌడ కులస్థులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..