Grammy Awards | సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల (Grammy Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయనీ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
గ్రామీ వేడుకలకు అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ (Kanye West) 2025లో బెస్ట్ ర్యా్ప్ సాంగ్‌కు నామినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఫంక్షన్‌కు తన భార్య, మోడల్ బియాంకా సెన్సోరీ (Bianca Censori)తో కలిసి వచ్చారు. అవార్డ్ ఫంక్షన్‌లోకి రాగానే రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వెళ్లారు. ఇంతలో బియాంకా ఉన్నట్టుంటి తన దుస్తులు తీసేసీ న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. నిర్వాహకులు వెంటనే ఆ జంటను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే, బియాంక ఎందుకు అలా ప్రవర్తించారో తెలియరాలేదు.
Also Read..
Grammy Awards 2024 | గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన భారత సంతతి మహిళ
Grammy Awards | అమెరికా మాజీ అధ్యక్షుడికి గ్రామీ అవార్డు
Maha Kumbh stampede | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. లోక్‌సభలో గందరగోళం