Grammy Awards 2025 | సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా అందించే 67వ ‘గ్రామీ అవార్డుల’ ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు దిగ్గజ సంగీత దర్శకులతో పాటు సింగర్స్ హాజరై సందడి చేశారు. ఇక ఈ అవార్డు వేడుకలలో భారత సంతతికి చెందిన ఇండో-అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ (Chandrika Tandon) అవార్డు అందుకుంది. చంద్రిక రూపొందించిన ‘త్రివేణి’ అనే ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ (Best New Age Ambient R Chant Album) ఆల్బమ్‌గా అవార్డును దక్కించుకుంది. ఉత్తమ లాటిన్ పాప్ ఆల్బమ్‌కి గాను పాప్ సింగర్ షకీరా అవార్డును అందుకోగా.. ఉత్తమ డ్యాన్స్ పాప్ రికార్డింగ్ విభాగంలో చార్లీ XCX అవార్డును దక్కించుకుంది. గ్రామీ అవార్డుల అందుకున్న వారి లిస్ట్ చూసుకుంటే..
రికార్డు ఆఫ్ ది ఇయర్ – నాట్ లైక్ అజ్ – కెండ్రిక్ లామర్
ఉత్తమ నూతన కళాకారుడు – చాపెల్ రోన్
ఉత్తమ రాప్ ఆల్బమ్ – అలిగేటర్ బైట్స్ నెవర్ హీల్ – డోచీ
ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్ – షార్ట్ ఎన్’ స్వీట్ – సబ్రినా కార్పెంటర్
లిరిక్ రైటర్ ఆఫ్ ది ఇయర్ – నాన్-క్లాసికల్ – అమీ అలెన్
ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన – ఎస్ప్రెస్సో – సబ్రినా కార్పెంటర్
ఉత్తమ పాప్ డ్యూయో/గ్రూప్ ప్రదర్శన – డై విత్ ఎ స్మైల్ – లేడీ గాగా & బ్రూనో మార్స్
ఉత్తమ డ్యాన్స్ పాప్ రికార్డింగ్ – వాన్ డచ్ – చార్లీ XCX
ఉత్తమ రాక్ ప్రదర్శన – నౌ & దెన్ – ది బీటిల్స్
ఉత్తమ రాక్ ఆల్బమ్ – హాక్నీ డైమండ్స్ – ది రోలింగ్ స్టోన్స్
ఉత్తమ కంట్రీ ఆల్బమ్ – కౌబాయ్ కార్టర్ – బియోన్స్
ఉత్తమ లాటిన్ పాప్ ఆల్బమ్ – లాస్ ముజెరెస్ యా నో లోరాన్ – షకీరా
ఉత్తమ మ్యూజిక్ వీడియో – నాట్ లైక్ అజ్ – కెండ్రిక్ లామర్