Grammy Awards | సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల (Grammy Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయనీ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter)కు గ్రామీ పురస్కారం వరించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ (100) గతేడాది డిసెంబర్ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్’కు (Last Sunday in Plains) బెస్ట్ ఆడియోబుక్ నెరేషన్ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జేసన్ కార్టర్ (Jason Carter) అందుకున్నారు.
జిమ్మీ కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేశారు. తన పదవీకాలంలో ప్రపంచ శాంతి కోసం ఆయన కృషి చేశారు. 1979లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారు. చైనాతో దౌత్యపరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కులకు ప్రాధాన్యం కల్పించారు. 1980 ఎన్నికల్లో ఆయన ఓడిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రపంచ శాంతికి కృషి చేశారు. దీంతో 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
Also Read..
Rishi Sunak | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య చివరి టీ20.. స్టేడియంలో సందడి చేసిన రిషి సునాక్
US Airliner | రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. తర్వాత ఏం జరిగిందంటే?