హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు (America) చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అందులో నుంచి దించేశారు. ప్రయాణికులు క్షేమంగా బయటపటడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు (US Airliner) చెందిన 1382 విమానం అమెరికాలోని హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నది. ఈ క్రమంలో హ్యూస్టన్‌లోని జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై టేకాఫ్ అవుతున్నది. ఒక్కసారిగా దాని రెక్కలలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికులను అందులోనుంచి దించేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు ఉన్నారని, అంతా క్షేమంగానే బయటపడ్డారని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అందులో పలువు ప్యాసింజర్లు తమను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లండి అంటూ కేకలు వేయడం గమనించవచ్చు. కాగా, విమానం ఇంజిన్‌లో సమస్యలు తలెత్తడం వల్లే మంటలు చెలరేగాయని ఫెడరల్ ఏవిషయన్ అధికారులు వెల్లడించారు.
A United Airlines flight in Houston just had to be evacuated when the engine caught fire on the runway.
I don’t know how we’re going to recover from 4 years of hiring people off clicking diversity quota boxes not merit. I’m just glad this plane didn’t leave the ground…. pic.twitter.com/9ILUbz1liX
— Mindy MF Robinson 🇺🇸 (@iheartmindy) February 2, 2025
A United Airlines flight from Houston to New York had to be evacuated after it caught fire during takeoff, according to the FAA.
The FAA says that the crew of United Airlines Flight 1382 had to stop their takeoff from George Bush Intercontinental/Houston Airport due to a… pic.twitter.com/w0uJuvBdan
— Breaking Aviation News & Videos (@aviationbrk) February 2, 2025