Teachers Day | పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 04 : సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి యేటా విద్య నేర్పే ఉపాధ్యాయులను, అధ్యాపకులను సన్మానించి గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి కూడా విద్యార్థులంతా కలిసి తమకు విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులను శాలువాలతో సత్కరించారు.
పెద్దపల్లి మండలం మారేడుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా గురువారం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఉపాధ్యాయులను పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అయితే గురువులకు సన్మాన కార్యక్రమం తర్వాత విద్యార్థులంతా దిగిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సన్మానం పొందిన ఉపాధ్యాయులంతా వెనుక నిలబడగా.. వారి ముందు విద్యార్థులంతా వినయంగా మోకాళ్లపై నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. గురువుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటేలా విద్యార్థులు కలిసి దిగిన ఈ ఫొటోను చూసిన వారు.. ఈ గురుపూజోత్సవం కొంచెం స్పెషల్ రా బాబు అని మాట్లాడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం జానకీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
GST | సిమెంట్, ఉక్కుపై జీఎస్టీ రేట్ల తగ్గింపు.. రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం..!
Laxmidevipally : ‘పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి’
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్