Manthani congress | రామగిరి, జూన్ 08 : రామగిరి మండలానికి చెందిన మంథని నియోజకవర్గం మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ మండలాధ్యక్షుడు రొడ్డ బాపన్న ఆదివారం షోకాస్ నోటిస్ జారీ చేశారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళతో జరిగిన ఫోన్ సంభాషణలో ఆ మహిళను మరో నాయకున్ని లక్ష్యంగా చేసుకుని అనుచితమైన పదజాలన్ని ఉపయోగించడం దృష్టికి వచ్చిందని రొడ్డ బాపన్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియమాల ప్రకారం పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులపై బర్ల శీను అనే వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించినందుకుగాను అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రోజు అతనికి షోకజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. మంథని నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు బహిర్గతమై ఆ పార్టీ నాయకుల మధ్యన సఖ్యత కరువైన నేపథ్యంలో.. ఆ పార్టీ అధిష్టానం క్రమ శిక్షణ చర్యలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి