Om Shanti Shanti Shantihi | తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఓటీటీలోకి రాబోతుంది. ఇటీవలే ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం డిజిటల్ వేదికగా రాబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి అధికారిక రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా, మార్చి 4 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అయితే ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకి మాత్రం ఒకరోజు ముందుగానే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది.
ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భర్త వేధింపులను ఎదిరించి తన ఆశయాల కోసం పోరాడే ఇల్లాలు ప్రశాంతి పాత్రలో ఈషా రెబ్బా, ఆమె భర్త ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ నటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో బ్రహ్మాజీ, రోహిణి, శివన్నారాయణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
A marriage.
A family.
A truth that changes everything.#OmShanthiShantiShantihi, streaming from March 4 only on #aha.#OSSS #TharunBhascker @ahavideoIN @yourseesha @actorbrahmaji pic.twitter.com/FKVIJQTMyb— ahavideoin (@ahavideoIN) February 23, 2026