హైదరాబాద్ : కుమ్మెర మల్లన్న జాతర ఘటనై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ప్రభుత్వం, అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. నాగర్కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి అసలు సిగ్గుందా అని ఘాటుగా ప్రశ్నించారు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని, కానీ, నెలల పసిపాపై చనిపోయినా న్యాయం చేయకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool ) కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప ( Child Died ) కుటుంబాన్ని కేటీర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పోలీసులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదన్నారు. కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో దాడి జరిగిన తర్వాత వారు ఫిర్యాదు చేస్తే అది సరిగ్గా లేదని పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఫిర్యాదు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి వాళ్ల కంప్లైంట్ చేశారని, మీరు కౌంటర్ కంప్లైంట్ చేయండని చెప్పారు. పోలీసులు వేసుకున్న యూనిఫాంకి గౌరవం ఇవ్వకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకుండా అధికార పార్టీ నేతలను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిడ్డకు పాలు ఇవ్వాల్సిన తల్లి ఖననం చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ న్యాయం కోసం రోడ్డు మీద కూర్చుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ అధికార యంత్రాంగం ఈరోజు ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున లక్ష రూపాయాల ఆర్థిక సాయం అందజేశారు. ఈ అమానవీయ ఘటనపై అసెంబ్లీలో సైతం గళం వినిస్తామని స్పష్టం చేశారు.
నాగర్ కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి సిగ్గుందా అసలు?
పోలీసులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు.. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు
కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో దాడి జరిగిన తర్వాత వారు ఫిర్యాదు చేస్తే అది సరిగ్గా లేదని పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు
కంప్లైంట్ తీసుకోకుండా అధికార… https://t.co/UrCYFt5ZzJ pic.twitter.com/54Fpolc7PO
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2026