Snow storm | అమెరికాలో కొనసాగుతున్న మంచు తుఫాన్.. ఈశాన్యంలో జనజీవనం అస్తవ్యస్తం
Snow storm | అగ్రరాజ్యం అమెరికా (USA) లో మంచు తుఫాను (Snow storm) కొనసాగుతున్నది. ముఖ్యంగా ఈశాన్య అమెరికాలోని కొన్ని ప్రాంతాలను మంచుదుప్పటి కప్పేసింది. రికార్డు స్థాయిలో 3 అడుగుల మేర మంచు కురిసింది. రోడ్ ఐల్యాండ్‌లోని ఎయిర్‌పోర్టులో అయితే 38 అంగుళాల మేర మంచు నిండిపోయింది. ఈ హిమపాతం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Snow storm : అగ్రరాజ్యం అమెరికా (USA) లో మంచు తుఫాను (Snow storm) కొనసాగుతున్నది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను మంచుదుప్పటి కప్పేసింది. రికార్డు స్థాయిలో 3 అడుగుల మేర మంచు కురిసింది. రోడ్ ఐల్యాండ్‌లోని ఎయిర్‌పోర్టులో అయితే 38 అంగుళాల మేర మంచు నిండిపోయింది. ఈ హిమపాతం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎక్కడికక్కడ మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచు, బలమైన గాలుల కారణంగా పాఠశాలలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని నగరాల్లో రవాణా సాధారణ స్థితికి వస్తోంది. మసాచుసెట్స్, న్యూజెర్సీ, డెలవేర్, రోడ్ ఐల్యాండ్‌లోని కొన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు.
అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. మంచువల్ల కొన్ని ప్రాంతాల్లో రైలు సర్వీసులు నిలిచిపోగా.. మరికొన్ని చోట్ల యథావిధిగా నడిచాయి. ఇదిలావుంటే.. గ్రేట్లేక్స్లో మరో తుఫాను రానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. అయితే దీని తీవ్రత ఎక్కువగా ఉండనప్పటికీ కొన్ని ప్రాంతాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

