Ferrari Luxury Car: జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు బీభత్సం.. వీడియో రిలీజ్
Ferrari luxury car: ఫెరారీ కారు అదపు తప్పి.. అవతలి రోడ్డులోకి దూసుకెళ్లిన ఘటన జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45లో జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఆ ప్రమాదానికి చెందిన సీసీటీవీ వీడియో రిలీజైంది. 4 కోట్ల ఖరీదైన ఆ కారు వెంకట రాజారెడ్డి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఫిబ్రవరి 22వ తేదీన మధ్యాహ్నం ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు(Ferrari Luxury Car) బీభత్సం సృష్టించింన విషయం తెలిసిందే. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న కార్లు, బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ వీడియో రిలీజైంది. జూబ్లిహిల్స్ రోడ్ నెం.45 లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.
సుమారు 4 కోట్ల ఖరీదైన ఆ ఫెరారీ కారు.. ఇ.వెంకట రాజా రెడ్డి పేరుమీద రిజిష్టర్ అయి ఉన్నది. ప్రమాదం జరిగిన తర్వాత తెల్ల దుస్తులు వేసుకున్న వ్యక్తి ఆ కారు డ్రైవర్ సీటు నుంచి బయటకు వచ్చాడు. తప్పు జరిగిందని సంకేతం ఇస్తూ అతను .. ఎడమ వైపు ముందు సీటు వద్దకు వెళ్లి ఆ డోర్ తీశాడు. ఆ డోర్ నుంచి ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. కారు డ్రైవర్ పై పోలీసులు కేసు బుక్ చేశారు. అతని ఆ డ్రైవర్ మద్యం తాగలేదని నిర్ధారించారు. డ్రైవర్‌ను క్రాంతి రెడ్డిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్యూర్, స్టీరింగ్ లాక్ కావడం వల్ల కారు అదుపు తప్పినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.
📍Jubilee Hills, Hyderabad, Telangana: On Road No. 45, a Ferrari lost control, mounted the divider, and rammed into other vehicles. The entire incident was captured on CCTV footage. pic.twitter.com/nS942CnCms
— Deadly Kalesh (@Deadlykalesh) February 25, 2026
ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డదిడ్డంగా పడిపోవడంతో రోడ్ నెం.45లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

