ఇల్లెందు, ఫిబ్రవరి 25 : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కిందపడటంతో వాటిపై నుండి లారీ వెళ్లగా ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇల్లెందు మండలం సుదిమల్లలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామం ఒకే కుటుంబానికి చెందిన పాయం సురేశ్, పాయం చిన్ని, పాయం ధనలక్ష్మి (45), జయశ్రీ(18) రెండు బైక్‌లపై ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ప్రయాణంలో ప్రమాదవశాత్తు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొని కిందపడ్డాయి. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన లారీ వారి పైనుండి వెళ్లడంతో ధనలక్ష్మి, జయశ్రీ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన సురేశ్, చిన్ని లను చికిత్స కోసం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి ఖమ్మంకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఇల్లెందు ఎస్ఐ హసీనా పరిశీలించారు.