BPL Families | కోల్ సిటీ, మే 16: ఇందిరమ్మ ఇండ్లు, పీఎంఎవై, రేషన్ కార్డు లబ్దిదారుల వివరాలు ఆన్ లైన్లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసి) అరుణ శ్రీ ఆదేశించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో వార్డు అధికారులతో ఇవాళ ఆయా దరఖాస్తుల పరిశీలనా ప్రక్రియ పురోగతిని కమిషనర్ అరుణ శ్రీ సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ అరుణ శ్రీ మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికే ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూరేలా వార్డు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని అన్నారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా డివిజన్ లలో పూడికతో నిండిన కాలువల వివరాలు , మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని వార్డు అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హన్మంత రావు నాయక్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం