RTC Rent Bus Drivers | మంథని, మే 20: ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె ఇవాళ కూడా కొనసాగింది. అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు పెంచాలని, రెండు జతల దుస్తులు ఇవ్వాలని, అందరికీ ఉచిత బస్సు పాసులు అందించాలనే కనీస డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు మాట్లాడుతూ.. చాలి చాలని వేతనాలతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అగ్రిమెంట్ గడువు పూర్తయిన తమకు ఆర్టీసీ సంస్థ వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సంస్థ స్పందించి వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె శిబిరాన్ని సీఐటీయూ నాయకులతోపాటు మరికొంత మంది నాయకులు సందర్శించి తమ మద్దతు ప్రకటించారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ