Revenue Conferences | సుల్తానాబాద్ రూరల్, జూన్ 01 : ఈ నెల 3 నుంచి 17 వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరుద్దీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ బషీరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వ్యవసాయ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు.
మండలంలోని అన్ని గ్రామాలకు రెండు బృందాలుగా ఏర్పాటుచేసి, ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఒకటి నుండి రెండు రోజులపాటు రెవెన్యూ సదస్సులు ఉన్న భూ యజమానులు నిర్దేశిత అప్లికేషన్ ఫారంలో వివరాలను నమోదు చేసి సంబంధిత పత్రాలతో సంయుక్తంగా కింద తెలిపిన తేదీలలో సమర్పించాలన్నారు.
ఈ నెల 3 న గొల్లపల్లి, సుద్దాలలో.. 4న కాట్నపల్లి, గట్టపెల్లి, 5న నీరుకుల , కదంబపూర్. 6న దుబ్బపేట, తొగర్రాయి. 9న భూపతిపూర్, మంచరామి. 10న సుల్తానాబాద్ ,పూసాల , రేగడి మద్దికుంట. 11న సుల్తానాబాద్ ,పూసాల, మియాపూర్. 12న అయితే రాజు పల్లి, చిన్న బొంకూర్. 13న కొదురుపాక , రెబల్ దేవుపల్లి. 16న గర్రెపల్లి, చిన్నకల్వల. 17న గర్రెపల్లి , కనుకుల గ్రామంలో సంబంధిత రెవెన్యూ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!