పెద్దపల్లి : విధి నిర్వహణలో ఉద్యోగులు, సిబ్బంది(Employees) ఎలాంటి ఒత్తిడిలకు లోను కావద్ద,ని క్షణికావేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పెద్దపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు తుమ్ము రవీందర్ పటేల్ సూచించారు. జిల్లా కేంద్రంలో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో ఉద్యోగులు, సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడటం, గుండెపోటు లాంటి అనారోగ్య సమస్యలతో మరణించడం తమను తీవ్రంగా కలచివేసింది అన్నారు.
అందుకే అత్యవసరంగా జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు కూడా ఉద్యోగుల పట్ల సోదరభావంతో మెలగాలన్నారు. ఈ అత్యవసర సర్వసభ్య సమావేశంలో కార్యదర్శి లెంకల బ్రహ్మానంద రెడ్డి, ఉపాధ్యక్షులు ఎండి సాజిద్ అలీ, కార్యనిర్వాహక కార్యదర్శి గండు సురేష్, కార్యాలయ కార్యదర్శి టి.శంకర్ యాదవ్ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | అన్నపూర్ణ తెలంగాణను.. ఏడాదిలో ఆత్మహత్యల తెలంగాణగా చేశారు: కేటీఆర్
Congress | టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి.. ముప్పేట ముట్టడిలో చిక్కిన అధికార పార్టీ