Youth Drugs | పెద్దపల్లి టౌన్, జూన్ 26 : యువత చెడు దారి పట్టకుండా ఉండేందుకు తల్లిదండ్రులు నిత్యం వారిని పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, విద్యార్థి దశ నుంచే మంచి ఆలోచనలతో మెలగాలని, ఆ దిశగా తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది యువత తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినక గంజాయి, డ్రగ్స్, సిగరెట్, పాన్ గుట్కా లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి శరీరాన్ని పాడుచేసుకుంటూ.. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం, రవాణా శాఖ ఎక్సైజ్ శాఖ, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని ఆదేశించారు. ఇక్కడ డీసీపీ కరుణాకర్, బీడబ్లూవో వేణుగోపాలరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్నకుమారి, ఏసీపీ గజ్జి కృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ఎస్సై లక్ష్మణరావు మల్లేష్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి