Farmers Welfare | కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్ 8 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు. ఇవాళ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన డైరెక్టర్లతో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం డైరెక్టర్లతో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్ పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో వరి కోతలు మొదలవుతున్నాయని ఐకేపీ, సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతీ డైరెక్టర్ గ్రామాల్లో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలించి.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలన్నారు. మార్కెట్ యార్డులో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ వ్యవసాయ మార్కెట్ అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గాజనమైన సదయ్య, వ్యవసాయం మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, డైరెక్టర్లు కలవేన రాజయ్య, దోమ్మటి రాజయ్య, కదురు మల్లయ్య, ఏనుగంటి రవి, చలిగంటి రామచంద్రం, అబ్దుల్ రసూల్, దోబిల సంపత్, కోమల మల్లమ్మ, దాగేటి రామచంద్రం, కూనారపు రమేష్, శివరాత్రి కిషోర్, నార్ల విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్