Heart Surgery | ధర్మారం, అక్టోబర్ 7 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నేస్తం మల్లారపు రాజేందర్‌కు హైదరాబాద్ లో గుండె శస్త్ర చికిత్స జరగగా.. అతడికి అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ( కెనడా) కొలుముల దామోదర్ యాదవ్ ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. రాజేందర్‌కు హైదరాబాద్ లోని దవాఖానలో గుండె ఆపరేషన్ జరిగి అక్కడే చికిత్స పొందుతున్నాడు.
నిరుపేద అయిన రాజేందర్‌కు గుండె శస్త్ర చికిత్స జరిగిందని అతనికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామానికి చెందిన పుల్లకొల్ల లింగమూర్తి ఫోన్ లో దామోదర్ యాదవ్ ని కోరారు. దీంతో లింగమూర్తి విజ్ఞప్తిపై దామోదర్ యాదవ్ వెంటనే స్పందించి తాత్కాలికంగా వైద్య ఖర్చుల కోసం రూ.20,000 ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ మేరకు డబ్బులను బాధితుడు రాజేందర్ కు అందజేశారు. అలాగే సంవత్సరానికి అతడికి అయ్యే మందుల ఖర్చులను కూడా భరించనున్నట్లు దామోదర్ యాదవ్ భరోసా ఇచ్చారు.
కాగా ఆపరేషన్ జరిగిన రాజేందర్ తల్లిదండ్రులు అతడి బాల్యంలోనే మృతి చెందారు. అతడి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో దామోదర్ యాదవ్ కష్టకాలంలో అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. గొప్ప మానవతా దృక్పథంతో రాజేందర్‌కు ఆర్థిక సహాయం అందజేయడంతోపాటు ఏడాది పాటు వైద్య ఖర్చులకు సహాయం చేస్తానని ప్రకటించిన ఎన్ఆర్ఐ దామోదర్ యాదవ్‌ను కొత్తూరు గ్రామస్తులతో పాటు రాజేందర్ కుటుంబ సభ్యులు అభినందించారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ