Godavarikhani Mamatha hospital | కోల్ సిటీ , ఏప్రిల్ 28 : గోదావరిఖనిలోని మమత ప్రైవేటు హాస్పిటల్లో చట్టవిరుద్ధంగా గర్భస్త లింగ నిర్ధారణ చేస్తున్నారన్న ఫిర్యాదుతో విచారణ కోసం వచ్చిన జిల్లా వైద్యాధికారిణి పట్ల ఆస్పత్రి వైద్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు చంపుతామని బెదిరించడమే గాకుండా డీఎంహెచ్ఓపైనే కేసు బనాయించడం అత్యంత దారుణమని న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ ప్రశ్నించారు.
ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రైవేటు హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ యంత్రం ఉందన్న సమాచారంతో రామగుండం తహసీల్దార్ సమక్షంలో తనిఖీ కోసం వచ్చిన డీఎంహెచ్‌ఓపై మహిళా అధికారిణి అని కూడా చూడకుండా దౌర్జన్యం చేయడం, ఆమె విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం బాధాకరమైన విషయమన్నారు.
నిజాయితీగా తన విధులు నిర్వర్తించేందుకు వచ్చిన డీఎంహెచ్ఓను చంపుతామని బెదిరించడంతో ఆమె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి దాక్కునే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ఈ సంఘటనతో రేపు మరేదైనా హాస్పిటల్లో తనిఖీలు చేయడానికి అధికారులు ఎలా వస్తారని ప్రశ్నించారు.
గోదావరిఖనిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని దవాఖానాలు ఇంకా ఉన్నాయని, రాష్ట్ర ఉన్నతాధికారులు నిర్భయంగా తనిఖీలు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణలోకి తీసుకొని సదరు హాస్పిటల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రజాప్రతినిధులుగా ఆస్పత్రిలో జరిగే అక్రమాలకు వంతపాడి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్