Collector Koya Sriharsha | పెద్దపల్లి, జూన్18 : పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ పూర్వ ప్రాథమిక విద్యను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సంక్షేమ శాఖ పని తీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ తో కలిసి కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. టాయిలెట్ లేని అంగన్ వాడీ కేంద్రాల జాబితా సిద్దం చేసి వెంటనే టాయిలెట్స్ నిర్మించాలన్నారు. అంగన్ వాడీ టీచర్లు, సహాయకులు సరిగ్గా పనిచేస్తే ఎక్కువమంది పిల్లలు వస్తారని, పిల్లల హాజరు వివరాలను సూపర్వైజర్లు మానిటరింగ్ చేయాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు అక్షరాలు, సంఖ్యల గుర్తింపు, రాయడం వంటి అంశాలలో పురోగతి సాధించాలని, పూర్వ ప్రాథమిక విద్య గురించి ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంబంధిత పౌష్టికాహారం తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు. సఖి సెంటర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్