Collector Koya sriharsha | ముత్తారం, జులై 10: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మచ్చుపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. పల్లె దవాఖానా ద్వారా గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రాదమిక వైద్యానికి అవసరమైన అన్ని రకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.
పారుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నూతన అడ్మిషన్లు కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్ధులు తీసుకున్నారు. పాఠశాలలో నూతన ప్రీ ప్రైమరీ క్లాసును ప్రారంభించారు. అభివృద్ధి కోసం అవసరమైన అదనపు నిధుల ప్రతిపాదనలు అందించాలని అన్నారు. పారుపల్లి ఎంపీయూపీఎస్ పీఎం శ్రీ క్రింద ఎంపికైందని, దీని అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు. చెంచుల ఎస్టీ కాలనీలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను వారి కోరిక మేరకు పరిశీలించారు. అర్హత ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
అడవి శ్రీరాంపూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లోని డిజిటల్ క్లాసుల పనితీరు ఉపాధ్యాయులు బోధించే బోధనా సరళినీ పరిశీలించి విద్యార్థులతో డిజిటల్ క్లాసులపై విద్యార్థులు నేర్చుకున్న వాటిని డిజిటల్ క్లాసుల ద్వారా వివరించారు. ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసే చిల్లి సెంటర్ను లాభసాటిగా నడపాలని, మహిళా సంఘాల ద్వారా కారంపొడి తయారు చేసి విక్రయించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో డీఆర్డీవో కాళిందిని, ఎంపిడిఓ సురేష్, ఏపిఎం పద్మ పాల్గొన్నారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్