అంతర్గాం, జులై 10 : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల, అంతర్గాం కెజిబివి పాఠశాలలో అటవిశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెద్దపల్లి జిల్లా అటవిశాఖ అధికారి శివయ్య తో పాటు సిబ్బంది మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.
మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎంపిడిఓ వేణుమాధవ్, ఫారెస్ట్ అధికారులు కొమురయ్య, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.