కాల్వ శ్రీరాంపూర్ జూలై 10 : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట గ్రామానికి చెందిన, తోట శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్, కునారం మాజీ ఎంపిటిసి కొల్లూరి రామ రాయమల్లు. బీఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నూనెటి కుమార్ యాదవ్, శ్రావణ్, ధర్మల రవి తదితరులు ఉన్నారు.